ఫిబ్రవరి 13న నారాయణఖేడ్‌ ఉపఎన్నిక

8
హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఉపఎన్నిక ఫిబ్రవరి 13న జరగనుంది. దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఫిబ్రవరి 13 ఎన్నిక నిర్వహించి, 16 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నిక కోసం ఈనెల 20 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.