ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం

` వారికి ప్రజలే బుద్ధి చెబుతా

` కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.