ఫిర్యాదుకు మించిన అక్రమాలు

డొల్ల కంపెనీలతో కోట్లు కూడబెట్టారు
విూడియాకు వెల్లడించిన లాయర్‌ రామారావు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  రేవంత్‌రెడ్డిపై చేసిన ఫిర్యాదులో తాను చెప్పింది గోరంత అయితే  ఐటీ అధికారుల సోదాల్లో బయటపడుతుంది కొండంత అని న్యాయవాది రామారావు అన్నారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఇండ్లలో ఐటీ అధికారుల సోదాలపై ఆయన విూడియాతో  మాట్లాడుతూ.. 19 డొల్ల కంపెనీలు, రూ. 400 కోట్ల అక్రమార్జనపై ఆధారాలతో ఫిర్యాదు చేశా. సాయిమౌర్య కంపెనీ ద్వారా అక్రమాలు జరిగాయి. ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఈ అక్రమాలు బయట పడ్డాయన్నారు.  రెండు నెలలు ఇన్వెస్టిగేషన్‌ చేశాక ఫిర్యాదు చేశామని అన్నారు. అయితే  నోటీసులకు సమాధానం చెప్పకుండా రాజకీయ కుట్ర అనడం సరికాదు. అక్రమార్జన చేసిన రేవంత్‌కు మద్దతు తెలపడం సరికాదు. ఢిల్లీ నుంచి స్పెషల్‌ టీమ్‌ రేవంత్‌రెడ్డి ఇండ్లలో సోదాలు చేసింది. రేవంత్‌ ట్యాక్స్‌లను ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. అధికారుల సోదాల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో జరిగిన అక్రమాలు ఊడా తానే బయటకు తీసినట్లు తెలిపారు. ఉప్పల్‌లో భూ దందా కూడా బయటపడిందని పేర్కొన్నారు. కాగా లాకర్లు తెరిచేందుకు రేవంత్‌రెడ్డి భార్య గీతను ఐటీ అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్లకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు తెలుసుకోనున్నారు.