ఫిల్మ్‌ఇనిస్టిస్ట్యూట్‌ విద్యార్థులకు రాహుల్‌ మద్ధతు

1

హైదరాబాద్‌,జులై31(జనంసాక్షి):

మహారాష్ట్రలోని పుణెలో ఆందోళన చేస్తున్న ఫిలిం ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలిశారు. పుణెలోని ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) ా’య్రర్మన్‌గా టీవీ నటుడు గజేంద్ర సింగ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు నిరసన చేపడుతున్నారు.

దాదాపు 250 మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ా’య్రర్మన్‌ పదవి నుంచి గజేంద్ర సింగ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఈరోజు రాహుల్‌ గాంధీ కలిశారు. విద్యార్థులకు మద్దతుగా నిలుస్తానని తెలిపారు.

ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని విద్యార్థులు రాహుల్‌గాంధీని కోరారు. విద్యార్థుల ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎందుకు ప్రవర్తించాలని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంటులో ఈ అంశం లేవనెత్తుతానని చెప్పారు.