ఫేస్‌బుక్ అరెస్టులపై వివరణ ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినవారి అరెస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐటీ చట్టం 66(ఎ) దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అటార్నీ జనరల్ ఈ సందర్భంగా సుప్రీంకు తెలియజేశారు. బాల్‌ధాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళలను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.