ఫేస్‌బుక్ వ్యవహారం పాల్‌ఘర్‌లో నేడు శివసేన బంద్
ముంబయి : బాల్ థాకరే మృతి అనంతరం ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శివసేన నేడు థానే జిల్లాలోని పాల్‌ఘర్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇక్కడ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. మరోవైపు 500 మంది పోలీసులతో ఇక్కడ భారీ బందోబస్తు చేపట్టారు. పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని శివసేన నేతలు తప్పుబట్టారు.