ఫోటోలకు ఫోజులు తప్ప..పోరాడిరదేవిూ లేదు
ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్ తీరుపై రేవంత్ రెడ్డి
న్యూఢల్లీి,డిసెంబర్6 (జనంసాక్షి ) : తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. ఫోటోలకు ఫోజులు తప్ప.. టీఆర్‌ఎస్ ఎంపీలు చేసిందేవిూ లేదన్నారు. నిరసన తెలుపుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఢల్లీికి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయడంలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతానన్న కేసీఆర్.. ఫాంహౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయం అయ్యాయన్నారు. వరంగల్‌లో మాయమైన 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదో చెప్పాలన్నారు. కేసీఆర్ ఆడుతున్న నాటకంతో రైతుల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. కావాలనే వడ్ల కొనుగోలు పక్రియను 60 రోజులు ఆలస్యం చేశారని విమర్శించారు. కెసీఆర్ ఢల్లీికి వచ్చి ఎందుకు నిరసన తెలపరన్నారు. ఇకపోతే కావాలనే పార్లమెంట్‌నుంచి గౌర్హాజరయ్యేందుకు టిఆర్‌ఎస్ ఎంపిలు యత్నిస్తున్నారని, ఇది బిజెపి టిఆర్‌ఎస్‌ల కుట్రలో భాగమని అన్నారు. దీనికి సంబంధించిన తమవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.