ఫ్యూగో అగ్ని పర్వతం పేలిన ఘటనలో 69కి చేరిన మృతుల సంఖ్య
శవాలను గుర్తించలేనంతగా మాడిపోయిన దృశ్యాలు
గ్వాటెమల,జూన్ 5(జనం సాక్షి): గ్వాటెమలలోని ఫ్యూగో అగ్ని పర్వతం పేలిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 69కి చేరుకున్నది. అగ్ని పర్వతం సవిూపంలో ఉన్న గ్రామాల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను తొలిగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. లావా విస్ఫోటనంతో సవిూప ప్రాంతాలన్నీ బూడిదలా తయారయ్యాయి. శిథిలాల కింద మానవ కళేబరాలు విగ్రహాల్లాగా కనిపిస్తున్నాయిని రెస్క్యూ వర్కర్లు అంటున్నారు. ఎర్రటి లావా ఉప్పొంగడంతో మృతిచెందిన వారి శరీరాలను గుర్తించడం కష్టంగా ఉందన్నారు. ముఖ కవళికలు, ఫింగర్ ప్రింట్స్‌ను కూడా గుర్తించడం కష్టమే అన్నారు. ప్రెసిడెంట్ జివ్మిూ మోరల్స్.. ధ్వంసమైన ప్రాంతంలో పర్యటిస్తున్నారు. మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైన సంగతితెలిసిందే. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 69 మంది మృతిచెందగా.. మరో 300 మందికి పైగా గాయపడ్డారని గ్వాటెమాలా అధికారులు చెబుతున్నారు. మధ్య అమెరికాలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఫ్యూగో ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బద్దలైన ఈ అగ్నిపర్వతం గత ఆదివారం మరోసారి బద్దలైంది. దీంతో పెద్ద ఎత్తున లావా వెదచిమ్ముతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద సముద్రమట్టానికి 12,346 అడుగుల ఎత్తు వరకూ ఎగిసిపడింది. అయితే ఫ్యూగో బద్దలైన సమయంలో దాని చుట్టుపక్క ప్రాంతాల్లో కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. వారంతా లావాలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు.ఫ్యూగో నుంచి వెలువడిన లావా దాదాపు ఎనిమిది కిలోవిూటర్ల వరకు నది మాదిరిగా వేగంగా ప్రవహించింది. ఈ క్రమంలో అనేక ఇళ్లకు మంటలు అంటుకుని కొందరు సజీవదహనమయ్యారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారమందుకున్న విపత్తు నిర్వహణ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 3వేల మందిని అగ్నిపర్వత పరిసర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్యూగో బద్దలై రెండు రోజులు అవుతున్నా ఇంకా లావా అత్యధిక ఉష్ణోగ్రతతో ఉందని అధికారులు చెబుతున్నారు. బూడిద కూడా దట్టంగా పేరుకుపోయినట్లు చెప్పారు. ఎమ్జ్గం/న్సీ అధికారులు శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలిస్తున్నారు.