ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి

C

– బాస్టిల్‌డే సంబరాల్లో పెనువిషాదం

– ట్రక్కుతో దాడి

– 80 మంది మృతి

పారిస్‌,జులై 15(జనంసాక్షి):ఉగ్రదాడితో మరోమారు ఫ్రాన్స్‌ వణికింది. కొత్తతరహాలో దాడి జరిగింది.  ట్రక్కుద్వారా ఉగ్రవాదులు ప్రజలను మట్టుపెట్టారు. దీంతో  ఫ్రాన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీస్‌ నగరంలో బాస్టిల్‌ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు మృత్యుశకటంలా ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 80 మంది మృతిచెందగా.. వందమందికిపైగా గాయపడ్డారు. వీరిలో 42 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ట్రక్కు బుల్లెట్లతో తూట్లు పడిపోయింది. ఘటన జరిగిన వెంటన ఉగ్రవాద వ్యతిరేక దళాలు నీస్‌ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. విచక్షణారహితంగా ట్రక్కును నడిపి ప్రజల ప్రాణాలు తీసిన డ్రైవర్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. దీనిని పోలీస్‌ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ట్రక్‌ వెనుకభాగంలో తుపాకులు, పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఇదో తరనహా దాడిగా భావిస్తున్నారు. ట్క్కుద్వారా ప్రజలను మట్టుపెట్టాలన్న ఆలోచన కారణంగా ప్రజలు ఆందోలనకు గురయ్యారు. బాస్టిల్‌ డేలో భాగంగా నిర్వహించే బాణాసంచా పోటీలను వీక్షించేందుకు పెద్దయెత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. బాణాసంచాను వీక్షిస్తున్న సమయంలోనే ట్రక్కు అధిక వేగంగా పాదచారుల వంతెనపై నుంచి దూసుకెళ్లింది. సుమారు 2కిలోవిూటర్ల మేర అదే వేగంతో దూసుకుపోవడంతో 80 మంది ప్రాణాలు కోల్పోగా,మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రేక్షకులకు దాదాపు వంద విూటర్ల దూరంలో ట్రక్కువేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే వేగంతో అది వీక్షకులను ఢీకొంది. దీంతో వారాంతా దాని వేగానికి కిందపడి దుర్మరణం చెందారు. దీంతో  ఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడ చూసినా రహదారిపై మృతదేహాలు చెల్లాచెదరుగా పడి భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగా ఉండటంతో వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్టీరోస్‌ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు.  ఘటన దృశ్యాలను ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దుతు వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయి. కొన్ని ట్విట్టర్‌ ఖాతాల్లో వీటిని ఉంచారు.  ఘటనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ¬లాండ్‌ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. దేశ భద్రతను సవిూక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి తేల్చి చెప్పిందన్నారు. అత్యవసర పరిస్థితిని మరో 3నెలల పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబమా నీస్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని దర్యాప్తులో పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అలాగే భారత ప్రధాని మోడీ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

8నెలల్లో రెండో ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్‌

నీస్‌ మారణ¬మంపై ఐసీస్‌ ఉగ్రవాదలు ఆనందం

పారిస్‌,జూలై15(ఆర్‌ఎన్‌ఎ): వరుసగా రెండో ఉగ్రదాడి ఫ్రాన్స్‌ను వణికించింది. ఫ్రాన్స్‌ దేశంలోని నైస్‌ నగరంలో గడచిన 8 నెలల్లో రెండో ఉగ్ర దాడి జరిగింది. మందుగుండు సామాగ్రితో భారీ ట్రక్కు ఉత్సవాల్లో మునిగితేలుతున్న జనంపైకి దూసుకువచ్చింది. ఉగ్రవాదులే ట్రక్కుతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఫ్రాన్స్‌ దేశంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. నగరంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నైస్‌ నగర మేయరు క్రిస్టియన్‌ ఈస్టోస్రి కోరారు. గత ఏడాది నవంబరులో ప్యారిస్‌ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 130 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఖండించారు. ఈ దాడిలో అమాయక జనం మరణించారని వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్‌లో ఉన్న బ్రిటీష్‌ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం కోరింది. భయంకరమైన పేలుడుతో ఛిద్రమైన దేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఫ్రాన్స్‌ లోని నీస్‌ నగరం మార్మోగింది. పసి పిల్లలతో సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన గురించి తెలిసిన వారంతా దిగ్భరాంతి  వ్యక్తం చేస్తుండగా ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) మద్దతుదారులు మాత్రం హర్షాతిరేకాలు ప్రకటిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. నీస్‌ నగరంలో జరిగిన ఉగ్రదాడిని సమర్థిస్తూ సోషల్‌ విూడియాలో వ్యాఖ్యలు పోస్ట్‌ చేశారు. ఉగ్రదాడిలో ఫ్రాన్స్‌ పౌరులు మృతి చెందడం తమకెంతో సంతోషం కలిగించిందని కామెంట్లు చేశారు. ‘దేవుడు గొప్పవాడు’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు నీస్‌ దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించింది. అమాయక పౌరుల ప్రాణాలు తీయడాన్ని తీవ్రంగా గర్హించింది. పారిస్‌ దాడి జరిగిన తర్వాత దాదాపు 8 నెలలకు ఐసిస్‌ మరోసారి నరమేధం సృష్టించింది. అయితే యూరో 2016 సాకర్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో ప్రశాంతంగా ముగియడంతో ఫ్రాన్స్‌ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా ఐసిస్‌ మరోసారి ఉగ్రదాడికి తెగబడడంతో ఫ్రాన్స్‌ తో పాటు ప్రపంచమంతా ఉలికిపడింది.

ఫ్రాన్స్‌లో మరో 3నెలలు ఎమర్జెన్సీ పొడిగింపు

నీస్‌ నగరంలో ఉగ్రదాడి ఘటనతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది.  ప్రస్తుతం కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని మరో మూడు నెలల పాటు కొనసాగిస్తు నిర్ణయం తీసుకుంది. ట్రక్కును ప్రజలపైకి దూసుకెళ్లించిన ఘటనలో  మృతుల సంఖ్య 80కు చేరుకుంది. ఆ దేశాధ్యక్షుడు ¬లాండ్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక దళం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ట్రక్కు ఘటన ఉగ్రవాద దాడిగా కొట్టిపారేయలేమన్న ఆయన భద్రత వ్యవస్థను పునఃసవిూక్షించుకోవాల్సి అవసరం ఉందన్నారు.

ట్రక్కుదాడి ఘటనతో షాక్‌కు గురయ్యాం

బాస్టిల్‌ డే సంబరాల్లో జరిగిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఆ షాక్‌ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. ఇలాంటి ఘటన తమ జీవితంలో చూడలేదని వాళ్లంటున్నారు. వేడుకలు జరుగుతుండగానే ఎక్కడి నుంచి వచ్చిందోగానీ ఓ వైట్‌ ట్రక్కు బీభత్సాన్ని సృష్టించిందని వాళ్లు చెప్పారు. వేగంగా వచ్చిన ట్రక్కు అడ్డొచ్చినవాళ్లను ఢీకొట్టుకుంటూ వెళ్తుంటే వారి శరీరాలు గాల్లోకి ఎగిరాయని ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు  తెలిపారు. ఇదంతా కావాలనే జరగుతున్నదని తెలుసుకునేలోగానే దారుణం జరిగిపోయిందన్నారు. రోడ్డుపై ఎటు చూసినా మృతదేహాలే కనిపించాయని, అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయిందని ఈ దాడిలో తన భార్యను కోల్పోయిన వాసిమ్‌ బౌచెల్‌ అనే వ్యక్తి చెప్పాడు. ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించిందని, ఎటు చూసినా శవాలు, బాధితుల ఆర్తనాదాలే కనిపించాయని తరుబి వాహిద్‌ అనే మరో ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. మొత్తంగా పట్టణంలోని ఈ ప్రాంతం శ్మశానంగా మారింది. ఫ్రాన్స్‌ దేశమంతా జాతీయ దినోత్సవమైన బాస్టిల్‌ డే రోజున సంబరాలు చేసుకుంటుండగా.. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి బాణాసంచా మెరుపులను తిలకిస్తుండగా ట్రక్కు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రక్తం ఏరులైపారింది. కేరింతలు సెకన్లలో హాహాకారాలుగా మారాయి. వందలాది కుటుంబాల్లో పెను విషాదం మిగిలింది. దేశమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఫ్రాన్స్‌లో తిరుగుబాటుకు నాంది పలికిన సందర్భంగా జరుపుకొంటున్న జాతీయ వేడుకల్లో ఇంతటి విషాద ఘటన జరగడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. బాస్టిల్‌ పారిస్‌లోని ఓ కోట పేరు. ఇదే రోజు ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పీల్చిన రోజు కావడంతో అంతా సంబరాల్లో మునిగిన దశలో గోరం జరిగింది.  ఇది ఫ్రాన్స్‌ చరిత్రలో కీలక పాత్ర పోషించింది. తర్వాత కాలంలో ఈ కోటను ఫ్రాన్స్‌ రాజులు జైలుగా ఉపయోగించారు. అప్పటి రాజు లూయీ 16 ఈ జైలును తనను వ్యతిరేకించిన వారిని, రాజకీయ ఖైదీలను, అప్పర్‌-క్లాస్‌ ఖైదీలను బంధించడానికి ఉపయోగించేవారు. 1789 జులై 14న ఫ్రెంచ్‌ రివల్యూషన్‌లో భాగంగా వేలాది ఖైదీలు బాస్టిల్‌ ద్వారాలను బద్దలుకొట్టుకుని బయటకు వచ్చారు. ఈ ఘటన ఫ్రాన్స్‌ తిరుగుబాటులో అత్యంత కీలకమైంది. కాబట్టి జులై 14న ఫ్రాన్స్‌ తిరుగుబాటుకు ప్రతీకగా జాతీయ దినోత్సవంగా

జరుపుకొంటున్నారు. అందుకే దీనికి ‘బాస్టిల్‌ డే’ అని పిలుచుకుంటున్నారు. బాస్టిల్‌ నుంచి ఎందరో రాజకీయ ఖైదీలు బయటకు రావడమే కాకుండా కోటలో ఉన్న గన్‌పౌడర్‌, ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నారు. నేషనల్‌ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పోరాటంతో స్వాతంత్య్రాన్ని  సంపాదించుకున్నాక బాస్టిల్‌ను కూలగొట్టేశారు. ప్రతి