ఫ్లెక్సీలో ఫోటో లేదని చిరంజీవి వర్గీయుల అసంతృప్తి

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చింజీవి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు ఫ్లెక్సీల్లో చిరంజీవి ఫోటో లేకపోవడంతో మంత్రి వర్గీయులు నిరసన తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ సమావేశానికి కీలకనేతలు సహా కాంగ్రెస్‌ జిల్లా, నగర, పట్టణ పార్టీ అధ్యక్షులు ఇటీవల నియమితులైన మండల బ్లాక్‌ స్థాయి అభ్యర్ధులు పాల్గొన్నారు.