ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో సభాపతి బృందం పర్యటన
నల్గొండ , జూలై 6 (జనంసాక్షి):
శాసన సభ స్పీకర్ నల్గొండ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను అధ్యయనం చేసేందుకు సభాపతి 25 మందితో కూడిన బృందంతో నాగార్జునసాగర్ ప్రాంతంలో పర్యటిం చారు. ఫ్లోరైడ్ సమస్యపై జిల్లా యం తాంగం సమర్పించిన పవర్‌ప్లాంట్ ప్రెజెం టేషన్‌ను బృందం సభ్యులు వీక్షించారు. స్పీకర్ బృందం శనివారం కూడా జిల్లాలో పర్యటించి ఫ్లోరైడ్ సమస్యపై అధ్యయనం చేసి, బాధితులను పరామర్శించనుంది. అదే విధంగా కృష్ణా నది నీళ్లు ఏయే గ్రామాలకు చేరుతున్నద తెలుసుకోనుంది. ఇదిలా ఉండగా శుక్రవారం జిల్లాకు చేరుకున్న స్పీకర్‌ను కలిసి టీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. నాగార్జునసాగర్ నీళ్లను నల్గొండ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ముందుగా వినియోగించాలని, కృష్ణా డెల్టాకు ఇవ్వడం వెంటనే నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు. స్పీకర్‌ను కలిసిన వారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ నీళ్లు నల్గొండ జిల్లా ప్రజల ఆస్తి అని, దీన్ని ఇక్కడి ప్రజలకు చెందకుండా సీమాంధ్ర పాలకులు తమ ప్రాంతాలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. సాగర్ నీటి మట్టం 512 అడుగులు ఉండాలన్న నిబంధనను అధికారులు, పాలకులు తొక్కి పెడుతున్నారని విమర్శించారు.