బంగారు ఆభరణాల చోరీ
హుజురాబాద్ గ్రామీణం, జనంసాక్షి: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి వాటిని చోరీ చేసిన సంఘటన హుజురాబాద్ పట్టణంలో సంచలనం కలిగించింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బండారు ఆభరణాలను మెరుగుపెడతామని చెప్పి ఆభరణాలను తీసుకుని ఒక డబ్బాలో వేశారని బాధితుడైన వేముల యాదగిరి చెప్పారు. వారు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఆ డబ్బా తెరిచి చూస్తే అందులో ఆభరణాలు లేవని వాపోయారు. మొత్తం 4 తులాల ఆభరణాలను దోచుకుపోయారని, వీటి విలువ దాదాపు లక్షా పదివేలు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.