బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : నారయణ
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసగా ఈ నెల 9న తల పెట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ కోరారు. రాష్ట్రబంద్‌కు సంబందించి గోడపత్రాన్ని వామపక్ష నేతలు విడుదల చేశారు. రాయితీల పేరుతో కంత్రి లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. మూతపడుతున్న చిన్న పరిశ్రమలకు రాయితీలు ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు.