బంద్ ప్రశాంతం
కరీంనగ్ క్రైం: టిఆర్‌ఎస్, ఓయూ జెఏసి పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగింది. తిమ్మాపూర్ మండలంలో ఆర్‌టిసి బస్సు, లారీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వేములవాడ, గోదావరిఖని బస్సుడిపోలకు టిఆర్‌ఎస్ నాయకులు తాళాలు వేశారు. బస్సులు బయటకు వెళ్లకుండా కరీంనగర్ బస్టాండ్ ఎదుట మాజీ ఎమ్మెల్సీ నారదాసు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్‌లో కుల సంఘాల జెఏసి ఆధ్వర్యంలో పోలీసులకు గులాబి పూలు ఇచ్చి వినూత్న నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టిఆర్‌ఎస్ బిజేపి, జెఏసిల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందురోజే సెలవు ప్రకటించగా, వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పెట్రోల్‌బంక్‌లు, బ్యాంకులను మూసివేశారు. పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల నేపథ్యంలో ఆర్టీసి బస్సులు పాక్షికంగా తిరిగాయి.