బంద్‌ విజయవంతం చేయండి

కాగజ్‌నగర్‌ : ఈనెల 9న వామపక్షాలు చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పట్టణంలో సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజన్నం. ఎం. శ్రీనివాస్‌, లాల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.