బడంగ్‌పేటలో భారీ చోరీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  విూర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని బడంగ్‌పేటలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగిది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు ప్రవేశించి.. రూ. 20 లక్షలను అపహరించారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్దారించుకున్న దొంగలు.. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్కాడ్‌ తనిఖీలు చేపట్టారు. ఎవరు చేశారన్నది ఆనవాళ్లు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.