బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కించారు.

 

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కెల చేసిన ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సామూహిక దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలు పదోన్నతులు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు తక్షణమే న్యాయమైన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో తంగళ్ళపల్లి అధ్యక్షులు టోనీ చౌటపల్లి వేణుగోపాల్, తిరుపతి రెడ్డి, మునిగేల రాజు శ్రీకాంత్ గౌడ్ భరత్ తదితరులు పాల్గొన్నారు