బతికపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
కరీంనగర్:పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామంలో నల్ల లక్ష్మీనారాయణ(40)ఈరోజు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేత కార్మికుడైన ఈయన 3సం. వరకు సిరిసిల్లలో కార్మికునిగా పనిచేసి ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై లక్ష్మీబాబు తెలిపారు.