బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తిన మహిళలు.
ఆడి పాడి తోటి వారిని ప్రోత్సహించిన ఎంపీపీ.
తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారు తయారు చేసిన బతుకమ్మలను అందంగా అలంకరించుకొని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పూల జాతర నిర్వహించారు.బతుకమ్మ పాటలతో చిన్న పెద్ద లేకుండా తమ ఆనందాన్ని తోటి వారితో పంచు కున్నారు.ప్రతి డిపార్ట్మెంట్ ఆడ మగ తేడా లేకుండా బతుకమ్మ ఉత్సవాలలో ఆడి పాడి తమ ఆనందాన్ని పంచుకున్నారు.మహిళలు జాతరగా బతుకమ్మలను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు అనంతరం బతుకమ్మను అలంకరించిన విధానము, ఎన్ని రంగుల పూలను బతుకమ్మల్లో వాడారు, ప్రత్యేకత ఏమిటి వీటిని ఆధారంగా చేసుకొని బహుమతు లను నిర్ణయించి విజేతలకు అందించారు ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడు తూ ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను యాలాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహి స్తున్నామన్నారు.అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతి ప్రధానం చేయడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపు తెచ్చుకుందన్నారు.మండల ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతు న్నానన్నారు.ప్రతి ఒక్కరు సంతోషంతో, ఆయు రారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ బతుకమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. చెన్నారం ఐకెపి సెంటర్ కి మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్,రెండో బహుమతి లక్ష్మీనారాయణ పూర్ అంగన్వాడికి వాషింగ్ మెషిన్, యాలాల మండల కేంద్రంకు చెందిన లక్ష్మీకి మూడో బహుమతిగా మిక్సీని అందించడం జరిగింద న్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం జరిగిందన్నారు.