బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధం

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 14 జనంసాక్షి : తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధం చేశారు.
సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో చేయించిన 240 పై చిలుకు వివిధ వెరైటీ డిజైన్ లతో చీరలు తయారు చేయించి పంపిణీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుండి అక్టోబర్ 4 వరకు జరుగు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు పంపిణీ చేయనున్నారు. బీదవారు కూడా ఆనందోత్సవాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం ఆశయంతో ఖర్చుకు వెనుకాడకుండా తెలుగింటి ఆడపడుచులకు అందించి కుటుంబం సంతోషంగా పండుగను బాగా జరుపుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 వార్డుల స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా మంత్రుల చే పంపిణీ చేయుటకు అన్ని సిద్ధం చేశారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కావలసిన చీరలు గోడౌన్ లో నిల్వ చేయడం జరిగింది.
జిహెచ్ఎంసి పరిధిలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతోపాటు హైదరాబాద్ జిల్లాలలో జిహెచ్ఎంసి పరిధిలో గల 30 సర్కిళ్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే హైదరాబాద్ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది. 624 రేషన్ షాపులలో 8 లక్షల 94 వేల 871 ఆహార భద్రత కార్డులు కలవు. 9 లక్షల 2 వేల 84 చీరెల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం 5 లక్షల 76 వేల 161 చీరలను పంపిణీ చేశారు.
Attachments area



