బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ (జనం సాక్షి ): అన్ని  మతాలకు చెందిన పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తోందని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. రానున్న బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు జరపాలని అయన అధికారులను ఆదేశించారు. జీ హెచ్ ఎం సీ సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సికింద్రాబాద్ లోని తన నివాసంలో లాంచనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 40 కేంద్రాలను ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుపుతున్నట్లు తెలిపారు. అర్హులందరికీ చీరలు లభించే లా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ కమీషనర్  దశరద్, యు సీ డీ ప్రాజెక్టు అధికారి  శ్రీనాద్, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.