బతుకమ్మ చీరల పంపిణీ.
బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్.
బెల్లంపల్లి,సెప్టెంబర్27,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణం 11వ వార్డులో మంగళవారం మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా బతుకమ్మ చీరలు, ఆసరా కార్డులను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు. తెలంగాణ సాంప్రదాయ ఆడపడుచుల పండగ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ, అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు గాలి శ్రీనివాస్, వార్డు ప్రత్యేకాధికారి రాంబాబు, రేషన్ డీలర్ చందు, ఆర్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, వార్డుప్రజలు పాల్గొన్నారు.