బతుకమ్మ తో వీఆర్ఏలునిరసన
ఖానాపురం సెప్టెంబర్ 25జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీల జీవోలు వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు జీవోలు అమలు చేయాలని గత 63 రోజుల నుండి వీఆర్ఏలు నిరవధికే సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సమ్మె శిబిరం వద్ద వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మండల అధ్యక్షులు బానోతు బిక్షపతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడి నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షులు బైరబోయిన ఐలేష్ ముదిరాజ్ పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు రాగం సుదర్శన్, జిల్లా జేఏసీ కో కన్వీనర్ గోనె మాధవి,మండల ప్రధాన కార్యదర్శి కొండపర్తి రవికుమార్,కోశాధికారి గోక నరసయ్య, మహేందర్,సంధ్య,రజిత,సుధాకర్, గోవర్ధన్, స్వామి, కందిపాటి శీను,హరీష్,వీరభద్రం,సాంబయ్య,శ్యామ్,సందీప్,తదితరులు పాల్గొన్నారు.