బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.
: ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్.
బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి)
సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లను ఆదివారం బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా పరిశీలించారు. స్థానిక పోచమ్మ చెరువు బతుకమ్మ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట 4వ వార్డు కౌన్సిలర్ షేక్ ఆస్మా, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, సిబ్బంది ఉన్నారు.