బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకోవాలి..

  మం‌‌త్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ సుధారాణి..
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 22 ( జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతీ పండుగ ను పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటున్నామని, జిల్లాలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని  రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
దసరా, బతుకమ్మ పండుగల ఏర్పాట్ల పైన గురువారం హనుమకొండ కలెక్టరెట్ లో కమిటీ సభ్యుల తో, అధికారులతో మంత్రి మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్ మేయర్ గుండు సుధారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో ఏ పండుగ ను
ఏనాడూ ఎవ్వరు గుర్తించలేదన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీ పండుగ ను ఒక ఉత్సవం ల జరుపుకునేలా నిధులను కేటాయిస్తున్నరన్నారు. యావత్తు
తెలంగాణ లో ఒక్క వరంగల్ లోనే బతుకుమ్మ పండుగ ను ఎంతో ఘనంగా ఆడబిడ్డలు జరుపుకుంటున్నారన్నారు. కేసీఆర్
ఒక అన్న గా ప్రతీ నిరుపేద ఆడబిడ్డ కు బతుకమ్మ పండుగకు చీరలను పంపుతున్నారన్నారు.
కానీ కొన్ని చోట్ల కొందరు నీచ రాజకీయాలకు పాల్పడుతు ఆ చీరలను తగుల  బేడుతున్నారన్నారు.ఈసారి అలాంటి చేష్టల కు దిగజారే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి    సీపీ ని ఆదేశించారు.
సద్దుల బతుకమ్మ జరిగే ప్రతీ చోట ట్రాఫిక్ నియంత్రణ కు పోలీస్ వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దసరా వేడుకలు జరిగే రంగలీల మైదానం లో కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక , సంప్రదాయాలకు ప్రతేక బతుకమ్మ, దసరా అన్నారు.అనుభవం ఉన్న అధికారులను నోడల్ అధికారులుగా నియమించి దసరా, బతుకమ్మ పండుగ లు బాగా జరిగేలా చూడలన్నారు.
కమిటీ సభ్యులు, అధికారులు కలిసి సమన్వయము తో పని చేసి పండుగ లు ప్రశాంత వాతావరణం లో జరిగేలా చూడాలన్నారు.
తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రంగలీల మైదానం లో దాదాపు
లక్ష మంది పాల్గొనే దసరా వేడుకలకు అధికారులు అన్నీ అంశాలలో సహకరించాలన్నారు.
చిన్న వడ్డేపల్లి వద్ద పనులు వేగవంతం కావాలన్నారు.
దసరా వేడుకలు జరిగే ప్రదేశాలలో
లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ పక్కాగా ఉండాలన్నారు.
ఈ సమావేశం లో నగర మేయర్ గుండు సుధారాణి, సీపీ తరుణ్ జోషి,జిల్లా కలెక్టర్ గోపి,  కమిషనర్ ప్రావీణ్య,వివిధ శాఖలకు చెందిన అధికారులు,దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Attachments area