బతుకమ్మ సంబరాల్లో అంగన్వాడీలు

ఆట పాటల్లో టీచర్లు
అశ్వరావుపేట సెప్టెంబర్ 29( జనం సాక్షి )
తెలంగాణ సంస్కృతిని అర్థం పట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఊరు వాడలో తెలంగాణ ఆడపడుచులు ఆట పాటలతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు.

మండలంలోని గురువారం అశ్వరావుపేట, బచ్చువారిగూడెం, పలు అంగన్వాడీ సెంటర్లలో తెలంగాణ బతుకమ్మ పాటలతో పండుగను అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమము లో సిడిపిఓ రోజా రాణి, సూపర్వైజర్లు, సౌజన్య, పద్మ, విజయలక్ష్మి, టీచర్లు రాధా, ఉష, పలువురు అనాధ టీచర్లు కలిసి బతుకమ్మ ఆటపాటల్లో మునిగి తేలారు.