బద్రి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ : ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ బద్రి మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం ప్రకటించారు. జర్నలిస్టుల సంఘాలు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. బద్రి సేవలను జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్రి మృతి చెందాడు.