బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఈటెల
ఖమ్మం : జిల్లాలోని బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ..దేశంలో సహజ వనరులున్న చోటే పరిశ్రమలు స్ధాపించాలని సూచించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కు బయ్యారం గనుల కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ రేపు గవర్నర్ ,ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.