బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దు
మంథిని: తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని తెరాస యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దని కోరుతూ మంథని పట్టణంలో తెరాస సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ వనరుల దోపిడి కొనసాగుతూనే ఉందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ గురించి చులకనగా మాట్లాడటం భావ్యం కాదన్నారు.