బయ్యారం గనులలోనే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి

సెంటినరీ కాలనీ (జనంసాక్షి): బయ్యారం గనులను ఇక్కడే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో, సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటియూసీ ఆర్జీ-3 డివాజన్‌ కార్యదర్శి వైవి.రావు బుధవారం సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఉన్న బయ్యారం గనులలోని ఇనుప ఖనిజాన్ని రాయలసీమ ప్రాంతానికి తరలిస్తే అడ్డుకుంటామని అన్నారు. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయంలో బ్రదర్‌ అనిల్‌కు బయ్యారం గనులను అప్పగిస్తే అడ్డుకున్న ఘనత సిపిఐ,ఏఐటీయూసీకే చెందిదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ గనుల నుండి ఉప ఖానిజాన్ని ఆంద్రాకు తరలించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం దీక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక్కడే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఈ గనులను సింగరేణికి అప్పగించాలని అన్నారు. ఇలా చేయాని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ఆందొళనలు చేపడతామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎల్‌,ప్రకాష్‌, జూపాక రాంచెందర్‌, పిబి.చారి, ఎస్‌,సంజీవరావు, జగదీశ్వర్‌, డి,వెంకటయ్య, ఖాధర్‌, సురేేందర్‌, తదితరులు పాల్గోన్నారు.