బలహీన పడిన మార్కెట్
ముంబాయి: మూడు రోజుల పాటు లాభాల్లో పయనించిన బీఎస్సీ, సెన్స్‌క్స్ శుక్రవారం మాత్రం 60.05 పాయింట్లు తగ్గి 16972.51 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ క్షీణతకు తోడు ఆపరేటర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ బలహీన పడింది. మరోవైపు ఎన్.ఎన్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 18.95 పాయాంట్ల దిగువన 5,146.06 వద్ద స్థిరపడింది. రంగాలవారీ సూచీలలో లోహాలు యంత్ర పరికరాలు, సాంకేతిక, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు ఒత్తిడికి లోనయ్యాయి. అయితే స్థిరాస్తి,వాహన, విద్యుత్తు రంగాల షేర్లు మాత్రం వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ఉన్నాయి.