బలిదానం తప్ప వేరే దారి లేదా ?
బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణాలు. అతను ఇంజ నీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం తెలంగాణ తప్ప మరొకటి ఆలోచించ డు. ఎప్పటికప్పుడు పరిణామాలు గమనిస్తూ తె లంగాణవాదులు ఏం చేయాలో ‘ఎస్‌ఎంఎస్’లు పెడుతుంటాడు. ఫొన్ చేసి అప్రమత్తం చేస్తుంటా డు. ఈ మధ్య వాళ్ల తల్లి చనిపోతే ఆమెకు ‘కర్మ’ చేసే సందర్భంలో కూడా తెలంగాణ రావాలని ప్రార్థిస్తూ పిండ ప్రదానం చేసిన పిచ్చి అభిమానం అతనిది. గత వారం ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్య వార్త తెలిశాక ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యా రు. ఆయనే కాదు యావత్ తెలంగాణ అదే ఉద్వే గానికి గురైంది. ‘సార్ ప్లీజ్ ఎలాగైనా సరే ఈ ఆ త్మహత్యల్ని ఆపండి…’ అంటూ పదే పదే ప్రాధే యపడ్డాడు. చివరకు యాదిరెడ్డి యాదితో బొంబా యి వెళ్తున్నట్టు ఆదివారం నాడు ఎస్‌ఎంఎస్ పం పించాడు. తెలంగాణ బాధనంతా తనలో నింపు కున్న అతని బాధను మనం అర్థం చేసుకోగలం.
మనమే కాదు యాదిరెడ్డి ఆత్మహత్యను, ఆ త రువాతి పరిణామాలను గమనిస్తోన్న ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని క ళ్లకు కట్టి చూపిన అతని ఉత్తరం చదివిన ఎవరికై నా మనసు చలిస్తుంది. రక్తం ఉడుకుతుంది. కానీ హృదయం లేని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ చా వు ఏ మార్పు తేగలిగింది ? చీమూ నెత్తురు లేని రాజకీయాలను అతని మృతి ఏ మాత్రం కదలించ గలిగింది ? రాజీనామాలు చేయండి, ఒక సంక్షో భాన్ని సృష్టించండి, తెలంగాణను తీసుకురండి అ ని ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆరువందల ప్రాణాల కు ఈ రాజ్యం నిజంగానే విలువనిచ్చి ఉంటే.. స్పీ కర్ వాళ్ల త్యాగాల ప్రతిఫలాలైన ఆ రాజీనామాల ను అలా చెత్తబుట్టలో పడేసి ఉండేవాడా? తమ మీద బత్తిడి ఉంది. కాబట్టి రాజీనామాలు చేశామ ని చెప్తున్నారు తప్ప, తామే ఒత్తిడిని పెంచే మార్గా లను మన ప్రజాప్రతినిధులు ఎందుకని అన్వేషించ డం లేదు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవని తెలుసు. కానీ, ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజల మ నసులో ఉన్నాయి. అవే ఈ వ్యవస్థ మీద, ప్రభు త్వం మీద చివరకు నాయకత్వంలో ఉన్న అందరి మీదా నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. అలాం టప్పుడు యాదిరెడ్డిలా ఆలోచిస్తోన్న వాళ్లకు ఎవరై నా ఏమని నమ్మకం కలిగించగలం. పోతున్న ప్రా ణాల విలువ తెలుసు కాబట్టి ఆత్మహత్యలు వద్దం టున్నాం. కానీ ప్రాణాలకంటే ప్రజల తమ ప్రాం తానికే ఎక్కువ విలువనిస్తున్నప్పుడు ఆ ప్రాణాలను కాపాడే శక్తి మనకున్నదా?
ఒక ప్రభుత్వానికి, ప్రభుత్వంలో భాగమైన నా యకులకు తప్ప ఆ శక్తిమనలో ఎవరికీ లేదన్నది వాస్తవం. మరి వాళ్లను ఎవరు మార్చాలి ? ఇంత టి బలమైన ఉద్యమం, ఆ ఉద్యమంలో వ్యక్తమవు తోన్న ప్రజాస్మామిక ఆకాంక్షలన్నిటికీ వాళ్లు పరిహా సం చేస్తుంటే.. చావు తప్ప ఏం మిగిలి ఉంటుంది ? అయినా మనమే గనుక అంతటి భరోసా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణత్యాగాలు ఉండేనా అన్నది కూ డా ఆలోచించాలి.
ఎవరైనా ఎందుకు చనిపోవాలనకుంటారు? తనతోపాటు బతికి ఉన్న వాళ్లు బతకడానికి కావా ల్సిన భరోసా ఇవ్వలేకపోయినప్పుడు, మొత్తంగా తన కలకూ వాస్తవానికీ మధ్య పూచ్చలేని అగాథ మేదో ఉందని అర్థమైనప్పుడు ఏ మనిషి అయినా బతకడంలో ఇక అర్థం లేదనే అనుకుంటాడు. ఒ క తత్వవేత్త చెప్పినట్టు ‘అల్లకల్లోమైన మనసుకు ఆ త్మహత్య చేసుకోవడం ఒక గొప్ప ఓదార్పు. దాని వల్లే మనిషికి తన మానసిక సంఘర్షణ నుంచి శా శ్వత విముక్తి దొరుకుతుం ది’. సరిగ్గా యాదిరెడ్డి కూ డా అలాగే అనుకున్నాడు. అది తన చివరి లేఖలో చె ప్పాడు. అతని నిర్ణయం ఎం త బలీయమైందంటే అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె చేతి వం ట డుపారా కమ్మగా తిని వెళ్లాలని అనిపించినా.. ఆ అనురాగం మళ్లీ బతికిస్తుం దేమోనని భయపడి, చచ్చి పోవాలనే నిర్ణయానికి వచ్చి తను అమితంగా ప్రేమించి న అమ్మ నుంచి, ఆ అమ్మ కంటే ఎక్కువగా ఆరాధించి న ఈ తెలంగాణ గడ్డ మీద నించి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
అలా వెళ్లినవాడు ఘన త వహించిన భారత ప్రజా స్వామ్యానికి ఒక సవాలు వి సిరి, ఈ వ్యవస్థ వైఫల్యాల కు ఒక మౌనసాక్షిగా నిలిచి న పార్లమెంటు భవనం ముందు తన నిండైన ప్రా ణాలిన బలి దానంచేశాడు. ఒక యువకుడు తన ముప్పై ఏళ్ల జీవితంలో పదేళ్లుగా ఒకే కలలో జీ వించాడు. అందరు తెలంగాణ యువకుల్లాగే, తన తండ్రులూ, తాతల తరంకాని విజయమేదో తనది కాబోతుందని నమ్మాడు. రెండేళ్ల పాటుగా నాలు గు కోట్ల మందిలో భాగంగా తనూ నిలబడి పోరాడినా గెలవలే కపోవడంపై దిగులు చెందా డు. నివేదనలు, నిరసనలు మొదలు వంటలూ వా ర్పుల దాకా అన్ని ప్రజాస్వామిక పద్ధతులను పా టించింది తెలంగాణ సమాజం. అందులో అత నూ భాగమైనాడు. అయి నా ఢిల్లీకి సెగ తగలనే లేదు. ఢిల్లీ దిగి రాలేదు. ఇక కుదరదనుకున్నాడో ఏమో.. తనే రైలెక్కిండు. రోజంతా ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకున్నాడు. తన మదిలో మెదిలిన ప్రతి ఆలోచనను తన సుదీర్ఘ లేఖలో రాసిపెట్టి పార్లమెంటు ముందే ప్రాణాలు తీసుకున్నాడు.
యాదిరెడ్డి ఢిల్లీని, పార్లమెంట్‌నే ఎందుకు ఎంచుకున్నాడు ? ఈ దేశ రాజధాని అది. తెలం గాణ విషయం తేల్చాల్సిన వాళ్లంతా అక్కడే ఉన్నా రు. ప్రధాని మన్మోహన్, సోనియా, చిదంబరం, అహ్మద్ పటేల్, కొత్తగా ఆజాద్ ఇట్లా తెలంగాణపై మాట్లాడిన వాళ్లు, మాట మార్చిన వాళ్లు, ఎంత కూ మాట్లాడని వాళ్లు అంతా అక్కడే కొలువు దీరి ఉంటారు. ‘ఇచ్చే వాళ్లు, తెచ్చే వాళ్లు’ అని చెప్పు కుంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న వాళ్లంతా ఒక కొత్త నాటకంలో మూగ పాత్రలై ఆ ఊరిలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తన తరుపున, తన ఊరి తరపున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీ కొలువు లో మంత్రిగా ఉండి అక్కడొక పెద్దమనిషిగా చెలా మణి అవుతోన్న జైపాల్‌రెడ్డి గారు అక్కడే ఉన్నారు. అందుకేనేమో అక్కడే తేల్చుకోవాలని యాదిరెడ్డి అ నుకున్నాడు. తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని యాదిరెడ్డికి వచ్చిన స్పృహ ఆ పెద్ద మనిషికి వచ్చి ఉంటే ఒక్క యాదిరెడ్డి కాదు ఆరు వందల మంది అమాయకులు బలి అయ్యేవాళ్లుకా దు. యాదిరెడ్డి తన లేఖలో అనేక విషయాలు ప్ర స్తావించిండు. ప్రజాస్వామ్యం ముసుగును లాగే సిండు. బాధ్యత మరిచిపోయిన జైపాల్‌తో సహా పాలకులందరికీ పేరుపేరునా తన ఆవేదనను తెలుపుకున్నాడు. సోనియా, మన్మోహన్‌లకు వాళ్ల బాధ్యత గుర్తుచేసిండు. తన శవాన్ని ఒక్కసారి చూడమని ప్రధానిని ప్రాధేయపడ్డాడు.
కనీసం అలాగైనా ప్ర జాస్వామ్యం కళ్లు తెరుచు కుంటాయేమోనని అశించా డు. కానీ ప్రధానికి అంత తీరికెక్కడిది ? అయినా మా ర్కెట్ భాష తప్ప మరో విష యం అర్థం కాని వాళ్లకు త్యాగాల భాష అర్థమవుతుం దా ? తెలంగాణలో 141 మంది ప్రజాప్రతినిధులు రా జీనామాల చేస్తేనే స్పందిం చకుండా తిరస్కరించిన ప్ర భుత్వం ఒక్క ప్రాణానికి స్పందిస్తుందని ఎలా భావిం చాడు ? తనకంటే ముందు కొన్ని వందలమంది తమ విలువైన ప్రాణాలు త్రుణ ప్రాయమనుకుని వదిలేసినా కనీసం చలించని వాళ్లు త న ప్రాణానికి విలువిస్తుంద ని ఎలా అనుకున్నాడు ? వి లువ ఇవ్వడం అటుంచి ఒ క అనాథ శవంలా ఈ ప్రభుత్వమే స్మశానానికి త రలించాలని చూసిందంటే మనం ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం.
అవును.. యాదిరెడ్డిలాగే ఇవాళ కోట్లాది గుండెలకు ప్రాణప్రదమైన తెలంగాణను కూడా ఢి ల్లీ వీధుల్లో అనాథగా వదిలేసింది ప్రభుత్వం. అ యినా ప్రజలు భరిస్తూనే ఉన్నారు. అవమానాలు దిగమింగుకుంటూ నిలబడి పోరాడుతూనే ఉన్నా రు. కొందడు ఇదే అదునని చర్చల్లో తమ బేరసా రాలను పెంచుకునే పోటీలో కమిటీలో స్థానం కో సం కుస్తీ పడుతున్నారు.
మరికొందరు నీరే లేని రెండు కళ్లల్లోంచి అ శ్రునివాళులు ప్రకటిస్తున్నారు. ఇంకొందరు నేలకొ రిగిన వీరపుత్రుల శవాల మీద నాలుగు చిల్లర పై సలు దొరుకుతాయేమో అని అడ్డదిడ్డంగా తిరుగు తూ ఉన్నారు. అయినా జనం జాతరగా కదులుతు న్నారు. అలా విర్దయంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లను అమరులనీ, త్యాగధనులనీ అంటున్నారు. గొంతెత్తి కోట్లాది గానాలాపన చేస్తున్నారు.
పోరాటంలో నుంచి వైదొలిగిన వాళ్లను వీరు లనే అందామా? బాధతోనో, భయంతోనో, భక్తితో నో, దిగులుతోనో, వ్యాకులతతోనో ఇవన్నీ ఇంకొ న్ని కలగలిసిన బాధ్యతా రాహిత్యంతోనో, బలవన్మ రణం పొందిన అందరినీ అమరులనే అందామా? చావు అనే సాహసానికి బడిగట్టినందుకు వాళ్లను ఏమందాం ? ‘నేను బతకకపోయినా పరవాలేదు తెలంగాణ వస్తేచాలు’ అనుకుని నిండైన ప్రాణాల ను తాగ్యం చేసిన వాళ్లను ఎలా పిలుద్దాం? వాళ్లు చేసింది నిజంగానే త్యాగమే కావచ్చు, కానీ ఫలి తంలేని త్యాగం వ్ల ప్రయోజనంలేని చావు వల్ల సా ధించేది ఏముంటుంది? నిలబడి పోరాడిన వాడే కదా వీరుడు. నిజమైన పోరాటంలో మరణిస్తేనే కదా అమరుడు.
అన్యాయమైన విషయమేమిటంటే బతుకు కో సం మొదలైన పోరాటం ఇవాళ చావుదశకు చేర డం. చావులే పోరాట రూపాలుగా మారిపోవడం ఉద్యమ దశలో ఒక మహా విషాదం. ఇది రాజకీ య పార్టీలకు, ప్రభుత్వాలకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ చుట్టూ అన్ని పార్టీలు ఆడుతున్న ఆటలో తెలంగాణ పిల్లలిలా బలిపశువులు కావాల్సి వస్తోంది. ఈ బలిదానాలకు మన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల ఆచరణలోని లోపా లే కారణంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటి వర కు తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకు న్న వాళ్ల మరణ వాంగ్మూలాల్లో పదే పదే కనిపిస్తు న్న అభ్యర్థన అందరూ కలిసి పనిచేయాలిని.
ఐక్యంగా పోరాడి తెలంగాణ తేవాలని! తమ చావులతోనైనా తెలంగాణ శక్తులు ఏకం కావాల ని’ వాళ్లు పదేపదే ప్రాధేయపడుతున్నారు. ఎంత దారుణం. నలుగురు స్వార్థపరులను కలపడానికి ఇన్ని నిండు ప్రాణాలు బలికావాలా? రాజీనామా లు చేయాలంటూ వందలమంది పిట్టల్లా రాలిపో యినా పట్టించుకోని వీళ్లు చివరికి పదవులు వదలినట్టు భ్రమపెడుతున్నది తమ భవిష్యత్తు చీకటి పాలవుతుందేమోనని బెంగతోనే తప్ప తె లంగాణ మీద భక్తితో కాదు గదా! పైగా రాజీ నామాలు భావోద్వేగంతో చేసినవి కాబట్టి ఆమో దించనని స్పీకర్ చెప్తే, మళ్లీ రాజీనామాలు చే యం అని భీష్మించుక్కూర్చుంటున్న వాళ్లు ఈ చా వులకు ఏమని జవాబు చెపుతారు. చర్చలని పిలవ గా చెవులూపుకుంటూ వెళ్లిన ఈ గంగిరెద్దులు అ ధిష్ఠానాల వద్ద వాళ్ల పరపతి పెంచుకుంటున్నారే మో గానీ తెలంగాణ పరువు తీస్తున్న సంగతి గుర్తించాలి.
అయినా, రాజకీయాల ఆటలో చంపుడు పం దెం పెట్టుకుని ఒకరి వెంట ఒకరు పరుగెడుతోన్న వీళ్లు కలిసి పనిచేయాలని కోరుకోవడం, దాని కో సం ప్రాణాలు వదులుకోవడం అమాయకత్వం. ఈ అమాయకత్వం ఇప్పటికి వందలాది మందిని బలిగొన్నది. తెలంగాణ ప్రజలు ఒక్క తాటిమీద ఉ న్నారన్న సంగతి ఇప్పటికే పదేపదే రుజువయ్యిం ది. ముఖ్యంగా ప్రజలు, జేఏసీ ఒక్కటిగా ఉన్నంత కాలం రాజకీయ పార్టీలు ఎక్కడున్నా ఎలా ఉన్నా పెద్దగా పోయేదేమీ లేదు.
తెలంగాణ జేఏసీకి తన బలమేమిటో అర్థ మయినట్టు లేదు. జేఏసీ ఆత్మవిశ్వాసంతో ఉంటే, ప్రజలను నిరంతరం కదిలించే రీతిలో కార్యాచర ణ ఉండి ఉంటే ప్రజలకొక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవసరం. ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఉద్యమ పంథా మా ర్చాల్సి ఉంటుందేమో ఆలోచించాలి. చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్టు తమ మనసులో ని భావాలకు, ఆలోచనలకు, ఆశలకు అనుగుణం గా సమాజం నడవనప్పుడు మాత్రమే వ్యక్తుల్లో నిరాశ నిస్పృహ మొదలవుతాయి. ఆ నిస్పృహే మనిషిని తనని తాను చంపేసుకునే నిస్సహాయుణ్ణి చేస్తుంది.
యాదిరెడ్డి చావు ఈ ప్రభుత్వపు మొండితనా నికి, రాజకీయ వ్యవస్థ చేతగాని తనానికి, ప్రజా స్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న జులాయి తనానికి ఒక మానవీయ నిరసనగానే భావించాల్సి ఉం టుంది. నిన్నటి దాకా మనలో ఒకరిగా బతికిన వాళ్లు, మనతోపాటు నడిచిన వాళ్లు, తమతో కొం దరినైనా నడిపించుకు కదలినివాళ్లు, తమలాంటి మనందరికీ ఒక కొత్త జీవితం కావాలని తపించిన వాళ్లు.. ఇలా ఒకొక్కక్కరుగా రాలిపోతుంటే ఇక చి వరి దాకా ఎవరు మిగులుతారు ? అలాంటి తె లంగాణ ఈ రాజకీయ నాయకులకు తప్ప ఎవరి కి ఉపయోగపడుతుందో ఆలోచించాలి. అయినా చావుల వల్ల తెలంగాణ రాదు. ఒకవేళ వస్తుందని ఎవరైనా అనుకుంటే అది కచ్చితంగా సామాన్యుల చావులతో మాత్రం కాదన్న సత్యం గుర్తించాలి. అ యినా ఇంత జరుగుతున్నా ఇంకా దాపరికాలతో పనిలేదు. ఏదో ఒకటి చెప్పేయండి. ప్రజలు కూడా తమకు తోచిన మార్గాన్ని ఎంచుకుంటారు.