బస్టాండ్ వైపు మల్లని ఆర్టీసీ బస్సు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
అక్టోబర్ 18,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజున తాండూరు డిపో డి.ఎం ఉపేందర్ జనం సాక్షి కథనానికి స్పందించారు. ఈ సందర్భంలో తాండూరు డిపో డి.ఎం ఉపేందర్ మాట్లాడుతూ బషీరాబాద్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్కువగా జీపులు,ఆటోలు ఉండడం వలన ఆర్టీసీ బషీరాబాద్ లోకల్ బస్సు బస్టాండ్ వైపు వెళ్లకుండా ఇటు నుండి తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. బస్టాండ్ వైపు వెళ్లడం వలన ప్రయాణికులు జీవులలో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా రైల్వే గేటు మాటిమాటికి పడడం వలన సమయం వృధా హై బస్సు ట్రిప్పులు తగ్గి తాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధి చేయడానికి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో బస్సు ట్రిప్పులు పెంచుతామని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జనార్ధన్, సిబ్బంది నవీన్ హాజరయ్యారు.