బస్సులను అడ్డుకున్న విద్యార్థులు
హనుమకొండ,సెప్టెంబర్27 (జనంసాక్షి) : దేశ వ్యాప్తంగా భారత్ బంద్ సందర్బంగా వరంగల్ పట్టణంలో షాపులను మూసేసారు. లెఫ్ట్ పార్టీలు ఉదయం నుంచే ర్యాలీలతో బంద్‌కు మద్దతును కోరారు. దీనిలో భాగంగా హనుమకొండ బస్టాండ్ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. బస్సులు బయటకు రాకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.