బస్సులో చోరీ.. రూ.5 లక్షలు అపహరణ
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు వెళ్తున్న బస్సులో చోరీ జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న మిర్యాలగూడకు చెందిన ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ. 5 లక్షలు అపహరించుకుపోయారు. నగదు అపహరణను గుర్తించిన వ్యాపారి చైతన్యపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.