బస్సు ఎక్కించి మందు పోశారు.. బస్సు దించి చితక బాదారు..!

 

 

గాయాలపాలై ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ లో కెసిఆర్ సభా వివాదం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 08.(జనంసాక్షి). జగిత్యాలలో జరుగుతున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామం నుంచి అధికార పార్టీ నాయకులు గ్రామం నుండి కొందరు యువకులను జగిత్యాల బహిరంగ సభ కు తీసుకువెళ్లారు. తిరుగు ప్రయాణంలో తీసుకెళ్లినవారికి మందు మర్యాద చేశారు. ఈ క్రమంలో సభకు వెళ్ళిన యువకుల మధ్య వాగ్నివాదం గొడవలకు దారి తీసింది. అనుహ్యంగా సర్థి చెప్పవలసినవాళ్లే ఊరికి వచ్చి బస్సు దిగిన తర్వాత యువకున్ని చితకబాదడం తో సమస్య పంచాయతీకి దారి తీసింది. గురువారం ఉదయం పంచాయతీ కోసం పిలిచి తన తండ్రి బాలసాని లక్ష్మణ్ ను దివ్యాంగుడని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారంటూ లక్ష్మణ్ కుమారుడు సాయికృష్ణ జిల్లా ఆసుపత్రి వద్ద రోధిస్తూ తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన గొడవ గురించి మాట్లాడేందుకని పిలిచి పెద్ద మనుషుల సమక్షంలోనే ఏ ఎం సి డైరెక్టర్ మోతే మహెశ్,మోతే బాలయ్య
,రేగుల దేవయ్య,అనే వ్యక్తులు చితకబాదినట్లు సాయికృష్ణ మీడియాతో తెలిపారు. ప్రశాంతంగా ఉన్న బస్వాపూర్ లో వివాదంకలకలం రేపుతుంది. సభ కోసం తీసుకువెళ్లి యువకులకు మందు పోసినవాల్లే ఊరికి వచ్చాక బస్సు దించి చితక బాధడంపై స్థానికులు మండిపడుతున్నారు. పంచాయతీకి దారి తీసిన పరిస్థితులు జిల్లాలో చర్చనియంశంగా మారాయి..