బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత
ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై కరీంనగర్‌లో జరిగే వివాహానికి వెళ్తున్నారు. స్తంభంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.