బస్సు, లారీల అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు
కరీంనగర్,(జనంసాక్షి): తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా ఆందోళనకారులు బస్సు, లారీ అద్దాలు పగులగొట్టారు. తిమ్మాపూర్ మండలం అలుగునూరు, రేణికుంటలో బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేశారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.