బస్సు సౌకర్యం కల్పించాలని సింగరేణి కార్మికుల ఆందోళన

రెబ్బన: బెల్లంపల్లి నుంచి ఖైర్‌గూడ, డోర్లీ-1, డోర్లీ-2 ఉపరితల గనులకు వెళ్లే కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఖైర్‌గూడ ముఖద్వారం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనికి స్పందించిన ఎన్‌వో-2 జీఎం ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి బస్సు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు.