బహుజన విప్లవ వీరుడు సర్దార్ పాపన్న మహారాజ్
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటిగా నిరూపించిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని బీఎస్పీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లగాని సుబ్బు గౌడ్ కొనియాడారు.బహుజన సమాజ్ పార్టీ పట్టణ కార్యాలయంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 వ జయంతి నిర్వహించారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఒక సామాన్య వ్యక్తి 12,000 మంది సైనికులతో శత్రుదుర్భేజమైన ఎన్నో కోటలను స్వాధీనం చేసుకొని కిలాసపురం ,జాఫర్గడ్, భువనగిరి తాటికొండ, సర్వాయి కోటలో నిర్మించి ధర్మ పాలన చేస్తూ చివరకు మొగల్ సామ్రాజ్యం లో గోల్కొండ కోటను సైతం జయించి ఏడు నెలల పాటు ఏలిన భహుజన వీరుడు పాపన్న గౌడ్ అన్నారు.సామాన్య కళ్ళు గీత కార్మికుని నుండి చక్రవర్తి వరకు ఎదిగి ఢిల్లీ పాలకులను ఎదిరించిన విప్లవ వీరుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు కర్రి సతీష్ రెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు జిలకర రామస్వామి,సయ్యద్ హుస్సేన్,మండల కన్వీనర్ వాస కరుణాకర్, వాస పల్లయ్య, తాళ్ల వెంకన్న నాగార్జున వెంకన్న మహేష్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు