బాధిత కుటుంబానికి బియ్యం అందజేత
ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )
మండలంలోని రంగాపురంఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన తెరాస కార్యకర్త (brs) కందిక సాయిలు కుటుంబానికి నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో 1క్వింటా బియ్యాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కoదిక నరేష్, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి మమతాబలరాం, మాజీ సర్పంచ్ బాబురావు, నాయకులు మాచర్ల కొమ్మలు, వార్డ్ మెంబర్స్ సదయ్య, రాజ్ కుమార్, భవాని నారాయణరావు, ప్రభాకర్ , సోమయ్య, కొమురయ్య, పైడి, మునేందర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,మరియు కుటుంబ సభ్యులు యాకయ్య, పాపయ్య, మొగిలి, సుధాకర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.