బాధిత కుటుంబాలను పరామర్శించిన ఒడిసిఎంఎస్ చైర్మన్, ఎంపీపీ

ఖానాపురం సెప్టెంబర్ 23జనం సాక్షి
మండలంలోని దబ్బీర్ పేట గ్రామంలో బాధిత కుటుంబాలను వరంగల్ ఉమ్మడి జిల్లా ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,లు మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య మరియు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో గత కొన్ని రోజులక్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన దబ్బిర్ పేట గ్రామ ఉపసర్పంచ్ ఆకారపు అనిల్ తండ్రి కిష్టయ్య ని పరామర్శించారు.అలాగే బానోత్ బాలమ్మ మృతి చెందగా వారి కుటుంబసభ్యులు యాక్యా,మోహన్,శ్రీను పరామర్శించి వారికి మనోధైర్యంను కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ నీలమ్మ-రాజు,ఎంపీటీసీ బట్టు శంకర్,సొసైటీ డైరెక్టర్ అన్నమనేని రవీందర్ రావు,సోషల్ మీడియా కన్వీనర్ దాసరి రమేష్,గ్రామ పార్టీ అధ్యక్షుడు సిద్దబోయిన పాపయ్య,తదితరులు పాల్గొన్నారు.