బానవత్ వంశీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
సారంగపూర్ (జనంసాక్షి) 18 అక్టోబర్
సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో లచ్చనాయక్ తండాకు చెందిన బానవత్ వంశీ ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించగా. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి , అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించారు,వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు .రవీందర్ రెడ్డి గారి వెంట మండల బిజేపి నాయకులు, తదితరులు ఉన్నారు.