బానుడి భగభగలకు తట్టుకోలేకపోతున్న జనాలు
చెన్నారావుపేట, మే 26, (జనంసాక్షి):
జిల్లాలోని ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలపై బానుడి ప్రతాపాన్ని ఉదయం 8 గంటలనుంచి వేడి మొదలవుతుంది. దీంతో ప్రజలు బేజారవుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణ్రోగ్రత 44 డిగ్రీల నుంచి 45 వరకు నమోదు కావడంతో మండల కేంద్రంలోని రోడ్లు మధ్యాహ్నం పూట నిర్మానుషంగా దర్శనమి స్తున్నాయి. తల్లి దండ్రులు తమ పిల్లల్ని బయటకు పంపడానికి జంకుతున్నారు. మండుతున్న ఎండ తీవ్ర తను తట్టుకోలేక ప్రయాణికులు బస్సులలో, ఆటోలలో ఉదయం, సాయంత్రం వేళలో ప్రయాణి స్తున్నా రు. ఇప్పటికి మండలంలోని కొన్ని గ్రామాల్లో వడదెబ్బకు, ఇతర అనారోగ్యాలకు గురై పలువురు ఆసుపత్రి పాలయ్యారు. కూలర్లు, ఫ్యాన్ల ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు. కరెంట్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని జనాలు వాపోతున్నారు. పొట్ట కూటి కోసం తప్పని పరి స్థిితిలో ఉపాధి కూలీలు ఎండలోనైన పని చేస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు, తీసుకుంటున్నారు. వైద్యుల చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.