బాబుతో ఇండియన్ బ్యాంక్ ఇడి భేటీ
అమరావతి,ఆగస్ట్28(జనం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య మంగళవారం కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఎంవోయు జరిగిన మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వర చర్యలపై చంద్రబాబుకు భట్టాచార్య హావిూ ఇచ్చారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని భట్టాచార్య కితాబిచ్చారు. అలాగే గ్రావిూణ ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా… కేరళ వరద బాధితులకు సప్తగిరి గ్రావిూణ బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.14,83,336ల చెక్కును సీఎం చంద్రబాబుకు భట్టాచార్య అందజేశారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని ఆయన కోరారు.