బాబుమోహన్‌పై కార్యకర్తల ఆగ్రహం

మెదక్‌, (మార్చి 24): నటుడు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌పై కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబుమోహన్‌ డౌన్‌డౌన్‌ అంటూ భారీగా నినాదాలు చేశారు. అయితే, మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలకు సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మెదక్‌ జిల్లా రామచంద్రాపురంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాస్థాయి నేతల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే బాబుమోహన్‌పై కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి మంత్రి హరీశ్‌రావు సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.