బాబు ఆదర్శంగా పుట్టిన రోజున దీక్ష
ప్రత్యేకహోదా కోరుతూ ఎంపి ముత్తంశెట్టి ఒకరోజు ఆందోళన
విశాఖపట్టణం,జూన్12(జనం సాక్షి ): ప్రత్యేకహోదా కోరుతూ ఎంపి ముత్తంశెట్టి తన పుట్టిన రోజున దీక్షకు దిగారు. విభజన హావిూ చట్టంలోని అంశాలు నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేటాయించాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, అనిత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో పొందుపరిచిన హావిూలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేస్తానని.. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ కళ్ళుతెరచి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయాలని కోరారు. ఎంపీ నిరాహార దీక్షకు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల టీడీపీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వ్యాపారవర్గాలు, మహిళలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.