బాబు ఎన్నికల హావిూలపైనే ప్రజల్లో చర్చ
గుదిబండగా మారిన పోలవరం,అగ్రిగోల్డ్, అమరావతి
మూసపద్దతిలోనే సాగిన నాలుగేళ్ల పాలన
ఉమ్మడి ఎపి నుంచి పాఠం నేర్చుకోని బాబు
శతృవులను కొని తెచ్చుకోవడం పెద్ద సమస్యే
వచ్చే ఎన్నికలు బాబుకు అంత సులవు కావేమో?
అమరావతి,జూన్13(జనం సాక్షి): ఎపిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏడాదికి ముందే హడావిడి మొదలయ్యింది. టిడిపి అండతో నాలుగు సీట్లు పొందిన బిజెపి ఏకంగా తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది. ప్రత్యేక¬దా హావిూతో తామే గట్టెక్కుతమాని కాంగ్రెస్ కలలు కంటోంది. ఇకపోతే పాలనా సంబంధ వ్వయహారాల్లో బాబు వైకరిలో మార్పు రాకపోవడంతో ప్రజల్లో కూడా కొంత విసుగు మొదలయ్యింది. పదేపదే హావిూలు గుప్పించడం తప్ప క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. అమరావతి నిర్మాణం, పోలవరం ఈ రెండూ బాబుకు పెద్ద మైనస్‌గా మారాయి. పోలవరం గురించి ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నా అందులో అవినీతికే పెద్దపీట వేశారన్నభావన ప్రజల్లో ఉంది. అలాగే అమరావతి నిర్మాణంపై రంగుల కల చూపిన బాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. నాలుగేళ్లు బిజెపితో అంటకాగినా పెద్దగా ఫలితం రాబట్టుకోలేకపోయారు. ఇకపోతే అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయడం కోసం వేసిన స్కెచ్‌లో మంత్రులు ఉన్నారన్న ప్రచారం ఉంది. దానిలో వేలుపెట్టి విలువైన భూములపై టిడిపి నేతలు కన్నేసి కంపెనీని మూసేసాల చేయడంతో పాటు, డిపాజిటర్లకు న్యాయం దక్కకుండా చేశారు. నిజానికి డిపాజిట్లను మించి ఆస్తులు ఉన్నాయి. అయినా కేసు తెగడం లేదు. ఇవన్నీ కూడా రేపటి ఎన్నికల్లో బాబును వెన్నాడడం కాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండగా టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సమావేశాల పేరిట సిఎం చంద్రబాబు ఎక్కువ కాలం గడిపే వారు. తాను చెప్పే విషయాలు కిందిస్థాయి వారికి ఎక్కుతున్నాయా లేదా అన్నది గమనించే వారు కాదు. కాన్ఫరెన్స్ అయిపోయాక దాని పర్యవసానాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకునే అలవాటు బాబుకు ఉండేది కాదు. ఎపి విడిపోయిన తరవాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గతనాలుగేళ్ల పాలనలో మళ్లీ పాతపద్దతిలోనే సాగుతున్నారు. సవిూక్షలు అవసరమే కానీ మోతాదుకు మించి చేపడతారు. ఏదైనా కార్యక్రమం చేపడితే అది అమలు జరిగిందా లేదా అన్నది పరిశీలన చేసుకోకపోవడం చంద్రబాబుకు పెద్ద మైనస్‌గా మారింది. సొంత పార్టీ వారి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ని నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా శాసనసభ్యులు, మంత్రులపై ముఖ్యమంత్రి కి పట్టులేకుండా పోతోంది. ఎక్కడిక్కడ కార్యక్రమాలు పార్టీ ద్వారా జరిగి నాయకులు ఎదిగేలా ప్రోత్సహించ కుండా అంతా తానై చేయాలని అనుకుంటారు. దీంతో బాబు పర్యటన కారణంగా ఏర్పాట్లు చేయలేక, సోది వినలేక అధికారులు, ఉద్యోగులలో వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. ఉదయం లేవగానే టెలీకాన్ఫరెన్స్ అనగానే ఎవరికైనా చికాకు తప్పదు. మహానాడులో టెలీకాన్ఫరెన్స్‌లు తగ్గించుకోమని ముఖ్యమంత్రికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడాసలహా ఇచ్చారు. ఉమ్మడి ఎపిలో అనంత, పాలమూరు కరువులను పారదోలడానికి ఆ జిల్లాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేయలేక పోయారు. హైఫై వ్యవహారాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. బడా పారిశ్రామక వేత్తలు, అంతర్జాతీయ నేతలతో కలసి తిరగడానికే బాబు ఎక్కువ మొగ్గు చూపుతారు. విదేశీ పర్యటనలకు కూడా బాగా ఖర్చు చేస్తారు. అసలే లోటు బడ్జెట్ అంటున్న బాబు ఇలాంటి ఖర్చులకు వెనకాడలేదు. ఏమైనా అంటే అభివృద్ది అంటూ విమర్శకుల నోల్లు మూయించే ప్రయత్నం చేస్తారు. అనేక పరిమితుల మధ్య అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటం చూపించినా నాలగేళ్లలో ఏ ఒక్క పనీ చేయలేకపోయారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రంతో పూర్తి చేయించి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది. కానీ దానిని చేపట్టడం ద్వారా చంద్రబాబు అభాసుపాలవడమే గాకుండా లాలూచీ వ్యవహా రాలు నడిపాడని, అంచనాలు ఎక్కువ చేసి నిర్మిస్తున్నాడని, డబ్బుకు కక్కుర్తి పడ్డాడని అప్రతిష్ట మూట కట్టుకున్నారు. నిజానికి దీనిని కేంద్రంతో పూర్తి చేయించి ఉంటే ఇతరత్రా సమస్యలు కూడా వచ్చేవి కావు. ఒడిషా, తెలంగాణలతో సమస్యలు ఉండివుంటే కేంద్రమే మేనేజ్ చేసుకునేది. దీనికి తోడు ఆ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో, కులం కోణంలో చూస్తుంటారు. అమరావతి అభివృద్ధి అన్నది మిధ్యగా మారడంతో ప్రజల్లో ఇంకా అసహనం పెరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ప్రత్యర్థులు పెరిగారు. ఎన్‌డిఎ నుంచి వైదొలగడంతో బిజెపి, పవన్ కళ్యాణ్ కూడా ముప్పేటా దాడి చేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, జనసేన తెరవిూద కనిపిస్తున్న ప్రత్యర్థులు కాగా… తెరవెనుక ఎందరో ప్రత్యర్థులు ఉన్నారు. భారతీయ జనతాపార్టీ నాయకులు ముఖ్యమంత్రిపై తీవ్ర దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడాప్రత్యేక¬దా పేరుతో చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందునుంచి దూకుడుతో సాగుతోంది. మొత్తంవిూద ముఖ్యమంత్రి చంద్రబాబుకు శత్రువులు పెరిగి పోతున్నారు. ఇకపోతే తమతో విభేదించిన చంద్రబాబును తిరిగి అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యంగా బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ దశలో తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థుల వ్యూహాలను అధిగమించి, వచ్చే ఎన్నికలలో గెలవడమనేది చంద్రబాబు ముందున్న అతి పెద్ద సవాల్! ప్రత్యేక¬దా రాలేదన్న కారణంగా ఏపీ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు అదే అస్త్రాన్ని అందుకుని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నరేంద్ర మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుపై ప్రజలలో సానుకూల ఉందా లేదా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. తమ పార్టీకి చెందిన ఎంపిలను,ఎమ్మెల్యేలను అప్పనంగా లాగేసుకోవడంతో వైకాపా అధినేత జగన్ కసిగా ఉన్నారు. ఇందుకు ఆయన లోపాయకారిగా బిజెపి మద్దతు తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఓ రకంగా బాబు ఎన్డీఎ నుంచి బయటకు వచ్చేలా వ్యూహం పన్ని విజయం సాధించారు. మొత్తంగా చంద్రబాబుకు ఇప్పుడున్న పనిస్థితుల్లో ఎపిలో ఎన్నికలు అంత ఈజీ కావన్నది అర్థం అవుతోంది.