బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు కృషి చేయాలి
కాగజ్‌నగర్: పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించారు. జయంతి ఉత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు చంద్రయ్య , భవా నీప్రసాద్, నాగేశ్వరరావు, జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ అంటూ అభివర్ణించారు. ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపు నిచ్చారు.