*బాలలు పనిలో కాదు బడిలో ఉండాలి.

 

 

 

 

 

 

*చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్.
చిట్యాల19(జనంసాక్షి)
బాలలు పనిలో కాదు బడిలో ఉండాలని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్ అన్నారు. బుధవారం బాలల హక్కుల రక్షణ, వారి సమస్యల పరిష్కారం పై చైల్డ్ లైన్ మండల ఇంచార్జి భాస్కర్ ఆధ్వర్యంలో మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో మండల స్టేక్ హోల్డర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో బాలల హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బడి మానేసిన బాలలు, వీధి బాలలు, అనాధ బాలలు, నిరాధారణకు గురైన బాలల సమాచారాన్ని చైల్డ్ లైన్ 1098 కి అందించాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలల హక్కుల రక్షణలో చైల్డ్ లైన్ 24 గంటలు పని చేస్తున్నదన్నారు. బాలల సమస్యలు లేని మండలంగా చిట్యాల మండలాన్ని తీర్చిదిద్దాలని సునీల్ కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ ఎంపీటీసీ సౌభాగ్యం, గ్రామ ఉప సర్పంచ్ భానుచందర్, చైల్డ్ లైన్ కౌన్సిలర్ రమాదేవి, టీమ్ మెంబర్ రామ్ చరణ్, , అంగన్వాడీ టీచర్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.